ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో పంజావిప్పుతున్న కరోనా..100కు చేరువలో కేసులు - @corona ap cases

కర్నూలులో కరోనా పాజిటీవ్​ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి..సోమవారం ఒక్కరోజే 18మందికి కరోనా పాజిటీవ్​ నిర్ధారణ కాగా..కేసులు మొత్తం 74కు చేరాయి. ఆదివారం వరకూ వచ్చిన 56కేసుల వివరాలను కలెక్టర్​ వెల్లడించారు.

kurnool corona cases near to 100
కర్నూలులో పంజావిప్పుతున్న కరోనా..100కు చేరువలో కేసులు

By

Published : Apr 7, 2020, 4:44 AM IST

Updated : Jun 4, 2020, 3:11 PM IST

కర్నూలు జిల్లాలో సోమవారం వరకూ...74కరోనా పాజిటీవ్​ కేసులు నమోదయ్యాయి.ఆదివారం వరకూ వచ్చిన కేసుల వివరాలను కలెక్టర్​ వెల్లడించారు. కర్నూలు 19, నంద్యాల 15, బనగానపల్లి 4, పాణ్యం 4, కోడుమూరు 3, నందికొట్కూరు 3, ఆత్మకూరు 2, బేతంచర్ల 1, రుద్రవరం 1, అవుకు 1, సంజామల మండలాల్లో ఒకరికి కరోనా ఉన్నట్లు చెప్పారు. తాజాగా వెల్లడైన 18 మంది వివరాలు వెల్లడించలేదు. కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున... వైద్య సేవలు, క్వారంటైన్ సెంటర్లు, ముందస్తు జాగ్రత్త చర్యలపై మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జరాంలు అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని... మంత్రులు కోరారు..

Last Updated : Jun 4, 2020, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details