కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వీరపాండియన్ అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 వేల 888 మందికి పరీక్షలు నిర్వహించగా... 1,463 మందికి సంబంధించిన ఫలితాలు వచ్చాయని.. 130 మందికి పాజిటివ్ అని తేలిందని చెప్పారు. అధిక సంఖ్యలో నమూనాలు తీసుకుంటున్నందున పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. జిల్లాలో పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లోనే అధికంగా కొత్తగా కేసులు నమోదువుతున్నాయని చెప్పారు. రెడ్ జోన్లలో 20వ తేదీ నుంచి ఎలాంటి ఆంక్షల సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో రేపు నుంచి కరోనా టెస్టింగ్ ల్యాబ్‌ను ప్రారంభిస్తామని కోవిడ్-19 ప్రత్యేక అధికారి అజయ్ జైన్ తెలిపారు.
కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ - కోవిడ్-19 ప్రత్యేక అధికారి అజయ్ జైన్
కరోనా పాజిటివ్ కేసులు కర్నూలు జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నందున... ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ సూచించారు.
కలెక్టర్ వీరపాండియన్ మీడియా సమావేశం