చివరి ఆయకట్టు వరకూ నీరందించాలి: కలెక్టర్
"ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకం"పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. కర్నూలు జిల్లాలో ఎంపికైన చెరువులకు చివరి ఆయకట్టు వరకూ నీరందించాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులకు సూచించారు.
చివరి ఆయకట్టు వరకూ నీరందించాలి:కలెక్టర్
నీటి పారుదల, వ్యవసాయశాఖ అధికారులతో కర్నూలు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రైతులను భాగస్వామ్యం చేసి నీటి సంఘాలను బలోపేతం చేయడమే ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, చేపల పెంపకం, భూగర్భ జలాల పెంపుదల కార్యక్రమాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
TAGGED:
kurnool collector