హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. కర్నూలులో భాజపా నాయకులు ఆరోపించారు. తుంగభద్ర పుష్కరాల విషయంలో స్పష్టమైన ప్రకటన ఇవ్వడం లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి విమర్శించారు. ఓ వైపు జిల్లా కలెక్టర్ స్నానాలకు అనుమతి లేదని ప్రకటించగా.. జలవనరుల అధికారులు నదికి నీరు విడుదల చేస్తున్నామని చెప్పడం విడ్డూరమన్నారు.
'పిండ ప్రదానాలకు అనుమతించి.. స్నానానికి నిరాకరణా..?' - తుంగభద్ర పుష్కరాల విషయంలో ప్రభుత్వంపై కర్నూలు భాజపా ఆగ్రహం
తుంగభద్ర పుష్కరాల్లో పిండ ప్రదానాలకు అనుమతించి.. స్నానాలకు నిరాకరిండంపై భాజపా కర్నూలు అధ్యక్షులు రామస్వామి మండిపడ్డారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్నానాలకు అనుమతించకపోతే.. ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు.
తుంగభద్ర పుష్కరాలపై మాట్లాడుతున్న భాజపా నాయకులు
పిండ ప్రదానాలకు అనుమతి ఇచ్చి.. స్నానాలకు నిరాకరించడంపై ప్రభుత్వాన్ని రామస్వామి ప్రశ్నించారు. పిండప్రదానం చేసిన వాళ్లు స్నానం చేసే సంప్రదాయం ఉండగా.. ఆ ఆచారాన్ని మంటకలుపడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పుష్కరాల సమయంలో స్నానాలకు అనుమతి ఇవ్వని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:రహదారులు అధ్వానం.. ప్రయాణంలో ఒళ్లు హూనం