ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుందనం రాళ్లతో అమ్మవారి రూపం...ఆకర్షణీయం - kundanam stickers

కుందనం రాళ్లతో దుర్గమాత చిత్రాన్ని వేసి కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బీటెక్ విద్యార్ధిని ఆకట్టుకుంటోంది. 1650 కుందనాలను ఉపయోగించి... నాలుగు గంటల పాటు శ్రమించి అమ్మవారి చిత్రానికి ప్రాణం పోసింది.

కుందనం రాళ్లతో అమ్మవారి రూపం...ఆకర్షనీయం

By

Published : Oct 6, 2019, 11:15 PM IST

కుందనం రాళ్లతో అమ్మవారి రూపం...ఆకర్షణీయం
దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కర్నూలు నంద్యాలకు చెందిన వైదేహీ అనే బీటెక్ విద్యార్థిని అమ్మవారి చిత్రాన్ని వేసింది. 16 వందల 50 కుందనాలతో నాలుగు గంటల సమయంలో అమ్మవారి చిత్రాన్ని గీసింది. కుందనం రంగురాళ్లతో వేసిన చిత్రం ఆకట్టుకుంటోంది. స్థానిక కోటేష్ ఆర్ట్స్ అకాడమీలో చిత్రకారిణి శిక్షణ తీసుకుంటోంది. చిత్రాన్ని గీసిన ఆ విద్యార్దినిని అకాడమి డైరెక్టర్ కోటేష్ అభినందించారు. గాంధీ 150 వ జయంతి సందర్భంగా విద్యార్థిని గీసిన బాపు చిత్రానికి హైదరాబాద్​లో గోల్డ్ మెడల్ అందుకుంది.

ABOUT THE AUTHOR

...view details