ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలుకు చేరిన కేంద్ర బృందం.. జోన్లవారీ వివరాల సేకరణ

కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన కేంద్ర బృందం కర్నూలుకు చేరుకుంది. ఆదివారం నుంచి ఆరు రోజుల పాటు ఈ బృందం జిల్లాలో పర్యటించనుంది.

Kovid-19 central team arriving in Kurnool for information about corona virus in kurnool district
కర్నూలు చేరుకున్న కొవిడ్-19 కేంద్ర బృందం

By

Published : May 9, 2020, 11:46 PM IST

కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు ఏర్పాటైన కేంద్ర బృందం కర్నూలుకు చేరుకుంది. స్థానిక ఏపీఎస్పీ రెండో బెటాలియన్​లోని అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ కె.ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టి, నగరపాలక సంస్థ కమిషనర్ డి.కె. బాలాజీ తదితరులను కేంద్ర బృంద సభ్యులైన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్​ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.మధుమిత దూబే, ప్రొఫెసర్ డా.సంజయ్ సాదుఖాన్​లు మర్యాద పూర్వకంగా కలిశారు. కరోనా కట్టడిపై కంటైన్మెంట్ క్లస్టర్ల వారీగా తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ బృందం ఆదివారం నుంచి 6 రోజుల పాటు జిల్లాలో పర్యటించనుంది.

ABOUT THE AUTHOR

...view details