45 ఏళ్లపాటు హెచ్.కొట్టాల సర్పంచిగా ఎల్లనాగయ్య
కర్నూలు జిల్లా బెతంచెర్ల మండలంలోని హెచ్‌కొట్టాలలో 45 ఏళ్లపాటు కోమల ఎల్లనాగయ్య సర్పంచిగా పనిచేసి గుర్తింపు పొందారు. అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ మన్ననలు పొందారు.
సర్పంచి ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఎక్కువగా మొగ్గుచూపుతారు. కర్నూలు జిల్లా బెతంచెర్ల మండలంలోని హెచ్‌కొట్టాలలో ఏకంగా 45 ఏళ్లపాటు పోటీ లేకుండా ఎన్నికై ప్రజలకు సేవలందించి మన్నన పొందారు ఎల్లనాగయ్య.. బేతంచెర్ల పరిధిలోని హెచ్‌కొట్టాల గ్రామం 1956లో పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఎక్కువసార్లు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక్కసారి బీసీ మహిళకు రావడంతో పోటీ జరిగింది. సుమారు 45 ఏళ్లపాటు కోమల ఎల్లనాగయ్య సర్పంచిగా పనిచేసి గుర్తింపు పొందారు. అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ మన్ననలు పొందారు. 2001 నుంచి 2006 వరకు బీసీ మహిళ సర్పంచి కొనసాగారు. 2006 నుంచి 2011 వరకు ఉన్నం నాగలక్ష్మిరెడ్డి ఏకగ్రీవం అయ్యారు. ఈయన హయాంలో గ్రామానికి నిర్మల్ పురస్కారం దక్కింది. 2011 నుంచి 2013 వరకు ప్రత్యేక పాలన కొనసాగగా 2013 నుంచి 2018 వరకు ఉన్నం విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఎన్నికల్లో సర్పంచి స్థానం బీసీ మహిళకు కేటాయించారు.