కర్నూలు జిల్లా ఆదోని శివారు ప్రాంతం ఆలూరు రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేసి కర్ణాటక మద్యం పట్టుకున్నారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణానికి చెందిన ఫయాజ్, గౌసియా కర్ణాటకలో మద్యం కొనుగోలు చేసి ఆటోలోని స్పీకర్ బాక్సులో దాచారు. ఆదోని రెండో పట్టణ సీఐ శ్రీరాములు, ఇతర సిబ్బంది చాకచక్యంగా తనిఖీ చేసి 390 టెట్రా ప్యాకెట్లు, 90ఎంఎల్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు. రూ. 35వేలు ఉంటుందని తెలిపారు. ఆటోను సీజ్ చేసి నిందితులను స్టేషన్కు తరలించారు.
స్పీకర్ బాక్సులో కర్ణాటక మద్యం తరలింపు .. స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆటోలోని స్పీకర్ బాక్సులో దాచి వేరే రాష్ట్రం నుంచి మద్యాన్ని తరలిస్తున్నారు. ఎవరైనా తనిఖీ చేసినా అవి కనిపించవు అనుకున్నారు. అయితే పోలీసులు చాకచక్యంగా వెతికి మరీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలూరు వద్ద జరిగింది.
కర్ణాటక మద్యం అక్రమ తరలింపు