Excavation of soil in journalists land: రాష్ట్రంలో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా భూకబ్జాలు.. ఇసుక దందాలు.. మట్టి మాఫియాలు.. ఇలా రాష్ట్రాన్ని గుళ్ల చేస్తున్నారు. ఏప్పుడేతే వేసీపీ ఫ్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా అక్రమాలే.. తాజాగా కర్నూలు జిల్లా కేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టులు.. తమకు ఇళ్ల స్థలాలు కావాలని ఎన్నో ఏళ్లుగా పోరాడి.. పోరాడి చివరగా 2009లో సాధించారు. 250 మంది జర్నలిస్టులు ఒకటిగా ఏర్పడి.. జగన్నాథగట్టు ప్రాంతంలో కర్నూలు జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకుని.. 15 ఎకరాల స్థలాన్ని 80 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. ఒక్కొక్కరికి 3.5 సెంట్ల ప్లాట్లు వచ్చాయి. ఈ స్థలాన్ని కొంత మంది రాజకీయ నాయకుల అండతో.. పలుమార్లు కొందరు కబ్జా చేసేందుకు యత్నించారు. జర్నలిస్టులు ఈ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే వస్తున్నట్లు తెలిపారు.. గతంలో ఈ స్థలంలో మట్టి మాఫియా మట్టిని తవ్వేందుకు యత్నించగా.. పోలీసుల సాయంతో.. తవ్వకాలను అడ్డుకున్నారు.
జర్నలిస్టుల సమస్యను పరిష్కరించడానికి ఈ స్థలంలో రోడ్డు వేస్తామని.. ఇంకా ఏవేవో చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. కాని ఆ హామీలను నెరవేర్చకుండా ఇక్కడ మట్టి తవ్వేస్తున్నారు.. గతంలో ఇక్కడ మట్టి తవ్వేయడాన్ని పోలీసుల సాయంతో.. తవ్వకాలను అడ్డుకున్నాము. అయితే ఇప్పుడు మళ్లీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ మట్టి తవ్వకం కారణంగా పేద జర్నలిస్టులు చాలా నష్టపోవలసి వచ్చింది. అసలుకే ఇక్కడ ఇల్లు కట్టుకోవడం కష్టం అనుకుంటుంటే ఇప్పుడు మట్టిని తవ్వి దీన్ని ఒక లోయ మాదిరిగా చేశారు.- సుబ్బయ్య, జర్నలిస్టు సంఘం నాయకుడు