ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య ఆత్మహత్య... అది తెలిసి భర్త కూడా..! - కర్నూలులో ఆత్మహత్య

భార్య ఆత్మహత్య చేసుకుందని తెలిసి భర్త ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్య
బలవణ్మరణం

By

Published : Dec 20, 2020, 10:59 AM IST

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం రేవనూరులో భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రామలక్ష్మి (21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే.. భర్త వెంకటరమణ పురుగుల మందు తాగి బలవణ్మరణానికి పాల్పడ్డాడు. బాధితుడు వెంకటరమణను వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గోస్పాడు మండలం యాలూరుకు చెందిన రామలక్ష్మిని వెంకటరమణ 5 నెలల కిందట వివాహం చేసుకున్నాడు. ఊహించని విధంగా ఆమె ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందటం అనుమానాలకు తావిస్తోంది. రేవనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details