ఎమ్మిగనూరు మార్కెట్కు భారీగా తరలివచ్చిన వేరుశనగ
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వేరుశనగ రాశులతో కళకళలాడుతోంది. మార్కెట్కు మొత్తం 8,485 బస్తాల వేరుశనగలు వచ్చాయి. రబీలో కాల్వలు, బోర్ల కింద సాగు చేసిన పంట చేతికందడం వల్ల రైతులు విక్రయించేందుకు మార్కెట్కు తీసుకువస్తున్నారు. క్వింటాకు గరిష్ఠ ధర రూ.6,190 పలికింది.
ఎమ్మిగనూరు మార్కెట్కు భారీగా వేరుశనగ దిగుబడులు