ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో దిగువ ప్రాంతాలకు వరద నీరు పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 1.99 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 848 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 75.9734 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ .. 42,108 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం నుంచి కల్వకుర్తికి 1301 క్యూసెక్కులు, హంద్రీనీవా కు 1589 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం - srisailam water latest news
శ్రీశైలం జలాశయానికి వరద ఉద్దృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 1.60లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి 1.99 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 848.10 అడుగులుగా ఉంది.
heavy water flow in srisail water fall at kurnool dst