ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తి నీటి విడుదల - శ్రీశైలం జలాశయం వార్తలు

ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Heavy flooding continues in Srisailam reservoir.
శ్రీశైలం జలాశయం 2 గేట్లు ఎత్తి నీటి విడుదల

By

Published : Aug 26, 2020, 11:37 AM IST

ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 1.88 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి వస్తోంది. ప్రవాహం పెరగడంతో జలాశయం 4 గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీల గరిష్ట స్థాయికి చేరుకుంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. విద్యుదుత్పత్తి, స్పిల్ వే ద్వారా ద్వారా 1.42 లక్షల క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు విడుదలవుతోంది.

ABOUT THE AUTHOR

...view details