కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. లోతట్టు గ్రామాలన్నీ వర్షపు నీటితో మునిగిపోయాయి. ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ జలమయం అయ్యింది. హొళగుంద మండలం హెబ్బాటం వద్ద పెద్దవంక పొంగింది. హొళగుంద- ఆదోని మధ్య రాకపోకలు స్తంభించాయి. ఆలూరు మండలం అరికెర తాండాలోని ఆర్డీటీ కాలనీలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు చేరింది. ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. డోన్ మండలంలోని అబ్బిరెడ్డిపల్లి చెరువులోకి వరద నీరు చేరుతుండటంతో... రహదారిపై నీరు ప్రవహిస్తోంది.
జిల్లాలో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ అయ్యాయి. వంకలు పొంగి పొర్లాయి. రహదారిపైకి నీరు ప్రవేశించి రాకపోకలకు అంతరాయం కలిగింది.
జిల్లాలో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం