ఒక పక్క కరోనా కట్టడికి అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బ్యాంకుల వద్ద భౌతిక దూరాన్ని జనాలు పాటించడం లేదు. ఖాతాదారులు బ్యాంకుల వద్ద డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు గుంపులు గుంపులుగా నిలబడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధిక కేసులు నమోదవుతున్న జిల్లాల్లో కర్నూలు రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
ఇక్కడ లాక్డౌన్ నిబంధనలు ఏవి? - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బ్యాంకుల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు.
బ్యాంకుల వద్ద బారులు తీరిన ప్రజలు