కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని 40వ జాతీయ రహదారి సర్వీస్ రహదారులు... ధాన్యాన్ని ఆరబెట్టుకునే కల్లాలుగా మారిపోతున్నాయి. ఆళ్లగడ్డ మండలంలోని నల్లగట్ల, బత్త లూరు గ్రామాల్లోని సర్వీస్ రోడ్లు ఇందుకు వేదికగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా రైతులు తమ పంట ఉత్పత్తులను సర్వీస్ రోడ్లపై ఆరబోస్తున్నారు. ఈ కారణంగా ఈ గ్రామాల్లో ఆగే ఆర్టీసీ బస్సులు, ఆటోలు జాతీయ రహదారి పైన ప్రయాణిస్తున్నాయి. ఫలితంగా వాహనాల నుంచి దిగే ప్రయాణికులకు వేరే వాహనాలతో ప్రమాదం పొంచి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్యనే రహదారి భద్రతా వారోత్సవాలు జరిగినా... నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
కల్లాలుగా మారుతున్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సర్వీసు రోడ్లు - bathaluru latest news
సర్వీసు రోడ్లను... ధాన్యాన్ని ఆరబెట్టుకునే కల్లాలుగా మారుస్తున్నారు... ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని పలువురు రైతులు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా... ఈ విషయంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని వాహనదారులు చెబుతున్నారు.
కల్లాలుగా మారుతున్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సర్వీసు రోడ్లు