అకాల వర్షాలతో వేరుశనగ పంట నష్టపోయిన రైతులను... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. కర్నూలు జిల్లాలో ఆయన పర్యటించారు. అరకొరగా పండిన పంటలు కూడా అకాల వర్షాలతో తడిసి... వేరుశనగ కాయలు ఎదుగుదల లేకపోవడంతో పశువులకు మేత కూడా రావడం లేదని ఆయన పేర్కొన్నారు. రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెడితే కనీసం పెట్టుబడికి పెట్టిన డబ్బులు కూడా రాలేదని ఆవేదన చెందారు.
రైతన్నలు అప్పులు ఎలా కట్టాలని వారు ఆందోళన చెందుతున్నారన్నారు. క్షేత్ర స్థాయి అధికారులతో ప్రభుత్వం వెంటనే రైతుల పొలాల్లో పంట నష్టం అంచనా నివేదికలు తయారు చేయించి, సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్‌లను ప్రకటించాలన్నారు.