కర్నూలు జిల్లా నంద్యాలలోని మధుమణి నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 100మంది పేదవారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తామని తెలిపారు. కార్యక్రమానికి పలు రాష్ట్రాలకు చెందిన వైద్యులు, ప్రముఖ వైద్య నిపుణులు హాజరయ్యారు. అనంతరం చెవి, ముక్కు, గొంతు శస్త్ర చికిత్సలు ప్రత్యక్షంగా చేసి వైద్యులకు అవగాహన కల్పించి వారి సందేహాలను నివృత్తి చేశారు.
100 మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు - nandyal
ఏదైనా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తే కొత్త అంశాలపై అవగాహన కల్పిస్తారని అనుకుంటాం. శిక్షణ సమయంలో ప్రత్యేక అంశాలను మరింత సులువుగా అర్థమవ్వడానికి పవర్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారు కొందరు. కాని ఈ వైద్యులు మాత్రం అందుకు భిన్నంగా ప్రత్యక్షంగా శస్త్ర చికిత్సలు చేసి చూపించారు.
నంద్యాలలో వైద్యుల జాతీయ సదస్సు