ఆరుగాలం కష్టించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు తీసుకువస్తే పంటను కొనుగోలు చేయకుండా మార్క్ఫెడ్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఆలూరు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన వేరశనగ పంటను అధికారులు కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. సీపీఎం ఆధ్వర్యంలో కర్నూలు ప్రధాన రహదారి బైఠాయించారు. వాహనాలు నిలిచిపోయి... ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
పంట కొనుగోలు చేయాలంటూ.. రైతుల రాస్తారోకో - ఆలూరులో సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన
వేరుశనగ పంటను కొనుగోలు చేయాలని కోరుతూ... ఆలూరులో సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. కర్నూలు - బళ్లారి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
కర్నూల్లో రైతులు రాస్తారోకో
TAGGED:
formers protest