కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం వడ్డెమాను గ్రామంలో వరద నీరు ప్రవేశించి ఇళ్లన్ని నీటమునిగాయి. బాలింత ఉన్న ఓ ఇంట్లో వర్షపు నీరు చేరటంతో 15 రోజుల బాబును, బాలింతను ఎత్తుకుని పక్క ఇంటికి తీసుకెళ్లారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వడ్డెమాను గ్రామ సమీపాన ఉన్న వాగులు ఉద్ధృతంగా ప్రవహించటంతో ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు.వరద ధాటికి మొక్కజొన్న, పత్తి, వరి పొలాలు నీట మునిగాయి. నక్కల వాగు ఉద్ధృతికి అల్లూరు- వడ్డెమాను గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
'వడ్డెమానులో వరద ఉద్ధృతికి నీట మునిగిన ఇళ్లు' - floods
కర్నూలు జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిసాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
floods in kurnool district