WATER FLOW TO SRISAILAM: శ్రీశైలానికి వరద ప్రవాహం ప్రారంభమైంది. గురువారం రాత్రికి 1,68,856 క్యూసెక్కుల నీరు చేరుతోంది. సుంకేసుల నుంచి 16 గేట్ల ద్వారా 60,208 క్యూసెక్కులు, జూరాల నుంచి 1,08,648 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. సుంకేసుల నుంచి శుక్రవారం ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి గురువారం నుంచి రోజుకు 12.50 టీఎంసీల నీరు చేరుతోంది. ఇదే ప్రవాహం 12-14 రోజులపాటు కొనసాగితే డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం (215 టీఎంసీలు) చేరుకునే అవకాశముంటుంది. గురువారం వరద నీరు జలాశయం క్రస్ట్ గేట్లను తాకింది. సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 831.90 అడుగులకు చేరింది. నీటినిల్వ 51.4304 టీఎంసీలుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలు రాయలసీమ జిల్లాలకు ప్రవహించే అవకాశముంటుంది.
WATER FLOW TO SRISAILAM: శ్రీశైలానికి పెరిగిన వరద.. ఇన్ఫ్లో ఎంతంటే? - శ్రీశైలానికి పెరిగిన వరద
WATER FLOW TO SRISAILAM: శ్రీశైలానికీ వరద ప్రవాహం ప్రారంభమైంది. సుంకేసుల నుంచి 16 గేట్ల ద్వారా 60,208 క్యూసెక్కులు, జూరాల జలాశయం నుంచి 1,08,648 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఇదే ప్రవాహం 12-14 రోజులపాటు కొనసాగితే డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం (215 టీఎంసీలు) చేరుకునే అవకాశముంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
WATER FLOW TO SRISAILAM