కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతిలో.. జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది గడ్డివాములు దగ్ధమయ్యాయి. ప్రమాద స్థలానికి దగ్గర్లో ఇళ్లు ఉండటంతో గ్రామస్థులు మంటలు ఆపేందుకు ప్రయత్నించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక కేంద్రం అధికారి మోహన్ బాబు సిబ్బందితో.. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మూడు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు.