ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుల ఆవేదన.. అధికారులకు పట్టదా? - kurnool district

కష్టపడి పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్మడానికి రైతన్న అష్టకష్టాలు పడతాడు. తీరా మంచి ధర దొరికి దిగుబడిని అమ్మితే ఆ డబ్బులు రావడానికి కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. ఈ సమస్యపై అధికారుల నుంచి ఆశించిన స్పందన రావడం లేదని.. రైతన్నకు నిరాశే మిగులుతోంది.

kurnool district
కాళ్ళ రిగెల తిరగుతున్న రైతులు.. అధికారుల స్పందనేది?

By

Published : May 31, 2020, 10:11 AM IST

కర్నూలు జిల్లా ఆదోని రైతులనుంచి 4 నెలలు క్రితం నాఫెడ్, మార్క్ ఫెడ్, కేడీసీఎంఎస్ ఆధ్వర్యంలో శనగలు, కందులు కొనుగోలు చేసింది. 15 రోజుల్లో బిల్లులు అందజేస్తామని చెప్పిన అధికారుల ప్రకటన.. ఇప్పటికీ అమలు కావటం లేదు.

ఆదోనికి సంబంధించి 4 కోట్ల రూపాయల బిల్లులు... 656 మంది రైతులకు రావాల్సి ఉందని మేనేజర్ శంకర్ తెలిపారు. మూడు నెలల నుంచి బిల్లుల కోసం 50 కిలో మీటర్ల దూరం నుంచి వస్తున్నామని... ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details