ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో రెండో దశ వ్యాక్సినేషన్​కు సర్వం సిద్ధం - కలెక్టర్ వీర పాండియన్ వార్తలు

కర్నూలు జిల్లాలో రేపు రెండో దశ వ్యాక్సినేషన్​కు సర్వం సిద్ధమైంది. రెండో డోస్ వేసుకోవాల్సిన వారు దగ్గర్లోని అర్బన్ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్ వేయించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో 3 లక్షల 40 వేల మందికి వాక్సిన్ వేశామన్నారు.

collector veera pandiyan
కలెక్టర్ వీర పాండియన్

By

Published : Apr 21, 2021, 7:52 PM IST

కర్నూలు జిల్లాలో రేపు రెండో డోస్ వాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. రెండో డోస్ వేసుకోవాల్సిన వారు గురువారం వారి ప్రాంతాల్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లలో వాక్సిన్ వేయించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా 156 ప్రాంతాల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 3 లక్షల 40 వేల మందికి వ్యాక్సిన్ వేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details