ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిజిటల్ సంతకం దొంగతనం.. వ్యక్తిని పట్టుకున్న అధికారులు

డిజిటల్ సంతకం దొంగతనం చేసిన వ్యక్తిని ఆదోని మార్కెట్ యార్డు అధికారులు పట్టుకున్నారు. మరోసారి కార్యాలయానికి వచ్చిన వ్యక్తిని సిబ్బంది గుర్తించి పట్టుకుని విచారించారు.

digi pendrive chori
డిజిటల్ సంతకం దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకున్న అధికారులు

By

Published : Feb 1, 2020, 5:31 PM IST

Updated : Feb 2, 2020, 12:11 PM IST

డిజిటల్ సంతకం దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకున్న అధికారులు

కర్నూలు జిల్లా ఆదోని పత్తి మార్కెట్ యార్డు సీసీఐ కార్యాలయంలో వారం రోజుల క్రితం డిజిటల్ సంతకం దొంగతనం జరిగింది. దొంగిలించిన వ్యక్తిని నిఘా కెమెరాల ద్వారా గుర్తించి అధికారులు పట్టుకున్నారు. దొంగిలించిన వ్యక్తి మరోసారి కార్యాలయానికి రావటంతో సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు. పత్తికొండకు చెందిన హనుమంతు అని గుర్తించారు. విలేకరిగా చలామణి అవుతూ ఇలాంటి పనులు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలుసుకున్నారు. డిజిటల్ సంతకం స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగిస్తామని యార్డు కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Last Updated : Feb 2, 2020, 12:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details