కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలో మంచినీటి సమస్య తీర్చాలని కోరుతూ... ఓ ఉపాధ్యాయుడు నిరసన చేపట్టాడు. గ్రామంలోని ప్రధాన కూడలిలో కూర్చుని ఒక్కడే ఆందోళన చేశాడు. అతడిని చూసి మరికొంతమంది గ్రామస్థులు మద్దతు తెలిపారు. అతనికి సంఘీభావంగా ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. గ్రామంలో ఎంతోకాలంగా తాగునీటి సమస్య ఉందనీ.. ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదనీ.. అందుకే ఆందోళనకు దిగానని ఉపాధ్యాయుడు తెలిపారు.
అతని బాట... అందరికీ దిక్సూచిగా నిలిచింది! - మద్దికెర
సమస్య అందరిదీ.. కానీ ఒక్కడే స్పందించాడు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ నడిరోడ్డు మీద కూర్చుని నిరసన తెలిపాడు. అతడిని చూసి మరికొందరు మద్దతు తెలిపారు. సమస్య తీర్చాలంటూ రోడ్డుపై బైఠాయించారు.
అందరి సమస్య కోసం.. ఒక్కడి పోరాటం