ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

srisailam:కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు - శ్రీశైలం ప్రధాన వార్తలు

శ్రీశైలం(srisailam)లో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు భ్రమరాంబాదేవి కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు హంస వాహనసేవ నిర్వహించనున్నారు.

స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబాదేవి
స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబాదేవి

By

Published : Oct 12, 2021, 7:37 AM IST

శ్రీశైలం(srisailam)లో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు భ్రమరాంబాదేవి కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల ఐదో రోజు సోమవారం భ్రమరాంబాదేవి భక్తులకు స్కందమాతగా దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లు శేషవాహనంపై కొలువుదీరి పూజలందుకొలన్నారు. ఆలయ ప్రత్యేక వేదికపై విశేష పుష్పాలంకరణతో స్కందమాత చతుర్భుజరూపిణిగా కొలువయ్యారు.

స్కందమాతమూర్తి భక్తజనులకు అభయహస్త దీవెనలిస్తూ.. ఒడిలో స్కందుడు(కుమారస్వామి)ని కూర్చోబెట్టుకొని దివ్యమంగళస్వరూపంలో ఆసీనులయ్యారు. అమ్మవారికి అర్చకులు, వేదపండితులు పూజలు నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ఆదిదంపతులు శేషవాహనంపై అర్చక, వేదపండితుల పుష్పార్చనలు, మంగళహారతులు అందుకొన్నారు. భక్తుల కోలాటాలు, నృత్యాల సందడి మధ్య ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ఆలయ ఉత్సవం వైభవోపేతంగా సాగింది.

ఇదీ చదవండి:13న హైకోర్టు సీజెేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం

ABOUT THE AUTHOR

...view details