ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దళిత ఉన్నతాధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉద్యమిస్తాం' - దళిత ఉన్నతాధికారులపై అనుచిత వాఖ్యలు

"దళిత ఉన్నతాధికారులపై అనుచిత వాఖ్యలు చేసిన భాజపా, వైకాపా నాయకులను కఠినంగా శిక్షించాలి" అంటూ... కర్నూలులో బహుజన ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దళిత అధికారులను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు.

dalith leaders protest in kurnool
కర్నూలులో బహుజన జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ

By

Published : Mar 24, 2021, 5:42 PM IST

దళిత ఉన్నతాధికారులపై అనుచిత వాఖ్యలు చేసిన భాజపా, వైకాపా నాయకులను కఠినంగా శిక్షించాలంటూ... కర్నూలులో బహుజన ఐకాస ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐ.పీ.ఎస్. అధికారి డాక్టర్. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్​, రాష్ట్ర ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడుపై భాజపా, వైకాపా నాయకులు అనుచిత వాఖ్యలు చేశారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా ఎమ్మెల్యే చేసిన వాఖ్యలకు నిరసనగా ఐకాస నాయకులు కర్నూలులో ర్యాలీ చేశారు. దళిత అధికారులను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని.. తక్షణమే వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details