కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. బుధవారం కొత్తగా 36 మందికి వైరస్ సోకగా.. మహమ్మారికి ఎవరూ బలికాలేదని ప్రభుత్వం వెల్లడించింది.
కర్నూలు జిల్లాలో తగ్గుతున్న కొవిడ్ కేసులు - 11 నవంబర్న కర్నూలు కరోనా కేసుల సంఖ్య
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మెల్లమెల్లగా తగ్గుతోంది. కర్నూలు జిల్లాలో కొత్తగా 36 మందికి మహమ్మారి సోకగా.. ఎవ్వరూ మరణించలేదని వైద్యులు ప్రకటించారు.
కర్నూలులో తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 59,851 మందికి కరోనా సోకగా.. 59,083 మంది మహమ్మారిని జయించారు. మరో 286 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్ ధాటికి 482 మంది చనిపోయారని వైద్యాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:మంత్రాలయంలో వింత గొర్రె పిల్ల జననం