కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాల్సిన వైద్యశాఖ అధికారులే కరోనా నియమాలను గాలికొదిలేస్తున్నారు. కర్నూలు జిల్లా వైద్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్, ఎఫ్.ఎస్.ఓ, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల కోసం నేడు ఇంటర్యూలు నిర్వహిస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. ఉద్యోగార్థులు కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారి కోసం వైద్యశాఖ అధికారులు ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయలేదని అభ్యర్థులు తెలిపారు.
వైద్యాధికారి కార్యాలయంలో ఉద్యోగాల ఎంపిక.. కరోనా నిబంధనలకు పాతర - కర్నూలు వార్తలు
కర్నూలు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో వైద్యశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్నప్పటికీ అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఉద్యోగార్థులు ఆరోపించారు.
కర్నూలు జిల్లా వైద్యాధికారి కార్యాలయం