కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఆదివారం కొత్తగా 685 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 38,835 మందికి కరోనా సోకగా... 31,711 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. 6,789 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహమ్మారి బారిన పడి ఆదివారం మరో 10 మరణించగా...మృతుల సంఖ్య 335కు చేరిందని అధికారులు వెల్లడించారు. మృతిచెందారని అధికారులు తెలిపారు.
కర్నూలు జిల్లాపై కరోనా పడగ... కొత్తగా 685 మందికి వైరస్ నిర్ధరణ - కర్నూలు జిల్లాలో కరోనా కేసులు వార్తలు
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం కొత్తగా మరో 685 మందికి వైరస్ నిర్ధరణ అయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,835కు చేరింది.
కర్నూలు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు