కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే జిల్లాలో కొత్తగా 823 మందికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 31,056 మంది కరోనా బారినపడ్డారు.
వారిలో 21,196 మంది కరోనాను జయించగా.. 9,596 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శాంతి రాం కోవిడ్ ఆసుపత్రి నుంచి 81 మంది డిశ్చార్జ్ అయ్యారు.