ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ - కర్నూలు రాజకీయ వార్తలు

కర్నూలు జిల్లా సంజామల మండలం అల్వకొండలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆధిపత్య పోరులో జరిగిన ఘర్షణల్లో ఇరు పక్షాలకు చెందిన వారికి గాయాలయ్యాయి.

Conflict between the tdp and ysrcp communities in karnool district
వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ

By

Published : Sep 21, 2020, 2:22 PM IST

పాత కక్షల నేపథ్యంలో కర్నూలు జిల్లా సంజామల మండలంలోని ఆల్వకొండ గ్రామంలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. తెదేపాకు చెందిన డమాల చెన్నయ్య కుమారుడు అనిల్...‌ వైకాపాకు చెందిన ఎస్సీ బాబు ఇంటి ఎదుట అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని నడిపాడు. అంతటితో ఆగకుండా.. తిట్టుకుంటూ వెళుతుండటంపై ఎస్సీ బాబు గొడవ పడ్డాడు. విషయం తెలుసుకున్న ఇరు వర్గాల కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు.

ఈ ఘర్షణలో తెదేపాకు చెందిన డమాల బాలదాసుకు తీవ్రగాయాలయ్యాయి. డమాల చెన్నయ్య, చిన్నచెన్నయ్య, అనిల్‌... వైకాపాకు చెందిన ఎస్సీ బాబు, సౌలురాజు, వెంకటసుబ్బయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై తిమ్మారెడ్డి సిబ్బందితో గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. వైకాపా కార్యకర్తలను బనగానపల్లె వైద్యశాలకు, తెదేపా కార్యకర్తలను కోవెలకుంట్ల వైద్యశాలకు తరలించారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details