కర్నూలు - మహబూబ్నగర్ సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వైద్యం కోసం రాష్ట్రానికి వచ్చి తిరిగి వెళ్లే తెలంగాణ వాహనాలను పోలీసులు నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు పరిశీలించాకే అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులను పరిశీలించాకే తెలంగాణలోకి పంపిస్తున్నారు.
ప్రైవేట్ అంబులెన్సుల్లో హైదరాబాద్ వెళ్లేవారికి షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వ అనుమతి తప్పక తీసుకోవాలని పోలీసులు సూచించారు. రోగికి పడక ఉందని ఆస్పత్రి అంగీకారపత్రం ఉంటేనే పంపిస్తామని పోలీసు అధికారులు తేల్చి చెబుతున్నారు.