స్వధర్మ ఆచరణ మహా యజ్ఞానికి చినజీయర్ హాజరు
కర్నూలులోని దేవి ఫంక్షన్హాల్లో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వధర్మ ఆచరణ మహాయజ్ఞ కార్యక్రమానికి చినజీయర్ హాజరయ్యారు. కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఓ పద్ధతి ప్రకారం దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.
కర్నూలు నగరంలోని దేవి ఫంక్షన్ హాల్లో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వధర్మ ఆచరణ మహా యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామీజీ హాజరయ్యారు. హిందూ మతంలో చేరిన వారిని స్వామీజీ సాదరంగా ఆహ్వానించారు. హిందూ మతాన్ని ఆచరిస్తూ.. ఇతర మతాలను గౌరవించాలని తెలిపారు. కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఓ పద్ధతి ప్రకారం దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఆలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.