కర్నూలు జిల్లా అవుకు మండలం రామాపురంలో బాలబాలికలిద్దరూ ఆత్మహత్యాయత్నం చేయగా.. బాలిక మృతి చెందింది. బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక గత కొంతకాలంగా ప్రేమించుకున్నారని స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. బాలుడి ఇంట్లో ఇద్దరూ ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. అయితే ఫ్యాన్ కింద పడటంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
మైనర్లు ఆత్మహత్యాయత్నం.. బాలిక మృతి, బాలుడి పరిస్థితి విషమం - CRIME NEWS IN KURNOOL
ప్రేమ వ్యవహారంతో బాలుడు, బాలిక ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో బాలిక మృతి చెందగా, బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా అవుకు మండలం రామాపురంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
suicide attempt
పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు వచ్చేసరికి.. బాలిక మృతి చెందగా బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని చెబుతున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి