ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెల్దుర్తి ప్రమాదంలో మృత్యుంజయుడు.. విజయ్!

కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో 16 మందిలో 15 మంది మృతి చెందారు. వీరిలో ప్రాణాలతో బయటపడ్డ విజయ్...కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మృత్యుంజయుడు  విజయ్

By

Published : May 13, 2019, 5:09 PM IST

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయ్

కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన విజయ్... కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో తుఫాన్ వాహనంలోని మొత్తం 16 మందిలో 15 మంది మృతి చెందారు. విజయ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. బీఎస్సీ, బీఈడీ చదివిన విజయ్... రామాపురంలోని ప్రైవేట్ పాఠశాల నిర్వహిస్తున్నాడని బంధువులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details