ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటర్లంతా తెదేపా వైపే:చంద్రబాబు - undefined

తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో శాశ్వతంగా అధికారంలో ఉండాలని అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రాబట్టిన వారికే పార్టీలో పదవులన్నారు. కర్నూలులో లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థులు, నాయకులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తెదేపా జెండా ఎగరాలని..దానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలని నేతలకు సూచించారు.

ఓటర్లంతా తెదేపా వైపే:చంద్రబాబు

By

Published : May 14, 2019, 6:04 AM IST

కోడుమూరులో తెదేపా జెండా ఎగరవేయనుందన్నారు. జవాబుదారీ తనం ఉంటేనే అనుకున్న ఫలితాలు వస్తాయన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీలో జవాబుదారీతనం పెంచేందుకు సమీక్షలు దోహదపడతాయన్నారు. సంక్షేమ పథకాల లబ్ధి ప్రతి పేద కుటుంబానికి అందాలన్నారు. ప్రజల్లో పొదుపు శక్తి పెరిగి, పేదరికంలేని సమాజం ఏర్పడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఓటర్లంతా తెదేపా వైపే:చంద్రబాబు
ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండటమే తమ ధ్యేయమన్నారు. యువతలో భరోసా రావడంతోపాటు మహిళలకు భద్రత ఉండేలా చేశామని గుర్తు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలన్నింటికీ సంక్షేమం అందాలని నేతలను కోరారు. గుండ్రేవుల ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామన్నారు. పనులు తక్కువ చేసిన కుప్పంలో తెదేపాకి అధిక ఓట్లు రావడం, ఎక్కువ పనులు జరిగిన నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు రావడం సరికాదని చంద్రబాబు స్పష్టంచేశారు. అనంతరం కర్నూలు, మంత్రాలయం బూత్ కమిటీ, ఏరియా కమిటీ కన్వీనర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. అభివృద్ధి, సంక్షేమంలో పార్టీకి..ప్రజలకు వారధులని నేతలకు తెలిపారు. నిరంతరం ప్రజలను అంటిపెట్టుకుని ఉండటంతో పాటు..సమస్యలు పరిష్కారం కావాలని నేతలను కోరారు. ప్రజల్లో శాశ్వత గౌరవం కల్పించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details