కర్నూలు జిల్లా రామలింగాయపల్లెలో రెండేళ్ల బాలుడు నీటి తొట్టెలో పడి మృతిచెందాడు. బాలుని తల్లి లక్ష్మి.. రెండో కాన్పు కోసం పత్తికొండ ప్రభుత్వాస్పత్రిలో ఉన్నారు. ఆడపిల్లకు జన్మనిచ్చారు. అదే సమయంలో ఇంటి దగ్గర ఉన్న బాలుడు ఆడుకుంటూ నీటి తొట్టెలో పడిపోయాడు. ఎవరూ గమనించని కారణంగా.. మృతి చెందాడు. ఓ వైపు పాప పుట్టిందని ఆ కుటుంబం ఆనందంలో ఉండగానే.. అదే సమయంలో కుమారుడు మృతి చెందడం.. తీరని విషాదాన్ని మిగిల్చింది.
అటు జననం.. ఇటు మరణం.. తీరని విషాదం! - pattikonda
కర్నూలు జిల్లా రామలింగాయపల్లెలో విషాదం చోటుచేసుకుంది. నీటి తొట్టెలో పడి రెండేళ్లు బాలుడు మృతిచెందాడు.
బాబు మృతి