కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం సింగవరం గ్రామంలో ఉండే వెంకటసుబ్బయ్య గౌడ్ అనే వ్యక్తి అతని పెంపుడు శునకం(చిన్న)కు పుట్టినరోజు జరిపించారు. ఇరుగుపొరుగు వారిని పిలిచి ఘనంగా వేడుకను నిర్వహించారు. అందరి మధ్య కేక్ కట్ చేసి.. పంచిపెట్టారు.
ప్రేమను చాటుకున్న యజమాని.. పెంపుడు శునకానికి బర్త్డే - singavaram latest news
పెంపుడు జంతువులపై ప్రేమ ఉన్న వారు వాటిని పెంచుకుంటారు. కుటుంబ సభ్యులతో సమానంగా చూస్తారు. వాటి ఆహార్యం, భోజనం వంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. కానీ కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం సింగవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. తన పెంపుడు శునకానికి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
పెంపుడు శునకానికి జన్మదిన వేడుకలు
వెంకట సుబ్బయ్యకు సంతానం లేదు. ఇలా పెంపుడు జంతువులకు జన్మదిన వేడుకలు జరిపించి ఆనందపడుతుంటాడు. శునకానికి ఇది రెండో జన్మదినం అని తెలిపారు. గతంలోనూ… అతను పెంచుకున్న ఆవుదూడకు మూడుసార్లు పుట్టినరోజు వేడుక నిర్వహించినట్లు స్థానికులు చెప్పారు.
ఇదీ చదవండి:ఎండ వేడిమి తట్టుకోలేక మృత్యువాత పడ్డ కోళ్లు