పెంచిన వేతనాన్ని తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఇప్పటి వరకూ బకాయి ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఆశా వర్కర్లపై వస్తున్న రాజకీయ ఒత్తిడులను, వేధింపులను తగ్గించాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం మాదంటూ.. ఆశా వర్కర్ల స్థానం నుంచి వైదొలగాలని స్థానిక రాజకీయ నాయకులు వేధిస్తున్నారని వాపోయారు.తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే లక్ష రూపాయలను ఇవ్వాలని స్థానిక వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
కలెక్టరేట్ ఎదుట ఆశావర్కర్ల ఆందోళన - undefined
ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
కర్నూలులో ఆశావర్కర్ల ఆందోళన
TAGGED:
asha workers strike