ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో ఏపీఎన్జీవోల సమావేశం

ఏపీఎన్జీవో అధికారుల సమావేశం కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించారు. ఎన్నికల్లో ఉద్యోగులకు అనుకోని ఘటన జరిగితే 50లక్షల బీమా కల్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి బండి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

APNGO state meet was held at Adoni in Kurnool district.
ఆదోనిలో ఏపీ ఎన్జీవో అధికారులు సమావేశం

By

Published : Jan 30, 2021, 3:38 PM IST


కర్నూలు జిల్లా ఆదోనిలో ద్వారక ఫంక్షన్ హాల్లో ఏపీ ఎన్జీవో అధికారులు సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి బండి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఏపీ ఎన్జీవోలకు ఎన్నికలు వెన్నతో పెట్టిన విద్య అని....కరోనా వల్ల వాయిదా వేయమన్నామని... కోర్టు తీర్పు గౌరవించి ఎన్నికల విధుల్లో పాల్గొంటామని రాష్ట్ర కార్యదర్శి బండి శ్రీనివాసులు తెలిపారు.

పోలింగ్ బూత్​ల్లో మెరుగైన వసతులు ఎన్నికల సంఘం కల్పించాలని, అనుకోని ఘటన జరిగితే 50 లక్షల బీమా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వసతులు సరిగా లేకుంటే తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే పీఆర్సీ అమలు చేసేలా ప్రభుత్వంతో చర్చిస్తామని ఉద్యోగులతో చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details