' సొంత నియోజకవర్గంలో బుగ్గన పర్యటన... ' - ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ప్యాపిలి, డోన్ మండలాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామాలవారీగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
minister
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డోన్‌లోని ప్రభుత్వ అతిథిగృహంలో యాభై నాలుగున్నర లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని బుగ్గన...... ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్యాపిలి, డోన్ మండలాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామాలవారీగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు.