Amos Was Murdered In Kurnool: కర్నూలు నగరంలో ఆమోస్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు .నగరంలోని శరీన్ నగర్ వద్ద నున్న హంద్రీ నది సమీపంలో గోనెగండ్ల మండలం అలువాల గ్రామానికి చెందిన ఆమోస్ను దుండగులు కిరాతకంగా హత్య చేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. డాగ్ స్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. ఆమోస్ 6 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పరువు హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కర్నూలులో సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వహించేవాడు.
కర్నూలులో వ్యక్తి దారుణ హత్య.. అదే కారణమా..? - ఆంధ్రప్రదేశ్ క్రైం వార్తలు
Amos Was Murdered In Kurnool: కర్నూలు నగరంలో ఆమోస్ అనే వ్యక్తి దారుణంగా హత్య కాబడ్డాడు.ఆమోస్ 6 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పరువు హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Murder
స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి వచ్చాం. మృతుడు అలువాల గ్రామానికి చెందిన ఆమోస్గా గుర్తించాం. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పుడు కొన్ని గొడవలు జరిగినట్లు అక్కడి పోలీసుల ద్వారా తెలిసింది. హత్య ఎలా జరిగిందనేది విచారిస్తున్నాం. -శంకరయ్య, సీఐ
ఇవీ చదవండి
Last Updated : Dec 24, 2022, 5:53 PM IST