బస్సులో ఉన్నవారికీ గాయాలు: కర్నూలు ఎస్పీ - వెల్దుర్తి
వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి మృత్యువాతపడ్డారు. కూడలిలో ద్వి చక్రవాహనాన్ని తప్పించే క్రమంలో పక్క రోడ్డులో వెళ్తోన్న తూఫాను వాహనాన్ని ఢీకొన్నట్లు కర్నూలు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారని... ఒకరి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా వెల్ధుర్తి వద్ద కూడలిలో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పక్కనే వెళ్తోన్న తూఫాన్ వాహనాన్ని బస్సు ఢీ కొట్టిందని ప్రమాద తీరును వివరించారు. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా... ఆసుపత్రిలో మరో ఇద్దరు మరణించారు. వాహనంలోని వారంతా తెలంగాణ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన వారుగా ఎస్పీ తెలిపారు. ప్రమాదంలో.. బస్సులో ఉన్నవారితో పాటు.. బైక్ పై ఉన్న వారూ స్వల్ప గాయాలపాలైనట్టు చెప్పారు. వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని... సమీపంలోని ఆసుపత్రిలో వారికి చికిత్స అందుతోందని తెలిపారు.