స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్... రూపాయికే గరం ఛాయ్ - august15
కర్నూలు జిల్లాలోని ఓ టీ దుకాణ యజమాని స్వాతంత్య్ర దినోత్సవాన్ని వినూత్నంగా జరుపుకుంటున్నారు. కేవలం రూపాయికే టీ విక్రయిస్తూ ప్రత్యేకతను చాటుతున్నాడు.
టీ
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఓ టీ దుకాణం యజమాని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలకు రూపాయికే టీ విక్రయిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. పట్టణానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి టీ దుకాణం యజమాని. పంద్రాగస్టును పురస్కరించుకొని తన దుకాణంలోని అల్లం టీ, గ్రీన్ టీ, రాగి మాల్ట్, కాఫీ, సొంటి కాఫీ, ధనియాల టీ ఇలా అన్ని రకాల టీ లను ఒక్కొక్కటి రూపాయికే విక్రయిస్తున్నాడు.