ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేవలం 2 వేల రూపాయలకే భూగర్భ జలాల రీఛార్జ్

వాననీటిలోని ప్రతి బొట్టును ఒడిసిపడుతున్నారు కర్నూలుకు చెందిన వ్యక్తి.  కేవలం రెండు వేల రూపాయల ఖర్చుతో ఏడాదంతా నీటి కొరత లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు.

By

Published : Jul 10, 2019, 8:03 AM IST

వర్షపు నీరు

కేవలం 2 వేల రూపాయలకే భూగర్భ జలాల రీఛార్జ్

కర్నూలు నగరంలోని డాక్టర్స్ కాలనీకి చెందిన రఘునాథ్ రెడ్డి తన ఇంటిపైన పడే వర్షపు నీటిని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మిద్దెపై పడే నీటిని పైపుల ద్వారా కింద ఉన్న డ్రమ్ములోకి పంపిస్తున్నారు. ఆ డ్రమ్ముకు దోమల మెష్ బిగించి దుమ్ము ధూళి పడకుండా చేసి.. ఆ నీటిని బోర్ గుంతలోకి పంపిస్తున్నాడు. బోర్ కేసింగ్ పైపుకు ముందుగానే వేసిన రంధ్రం ద్వారా భూమిలోకి నీరు చేరుతుంది. ఈ విధానం ద్వారా వేసవి కాలంలో బోర్లు ఎండిపోవని.... నీటి కొరత ఉండదని రఘునాథ్ రెడ్డి అంటున్నారు. ఇంట్లో బోర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేస్తే నగరాన్నింటిలోనూ భూగర్బ జలాలు పెరుగుతాయన్నారు. ఈ విధానానికి 2వేల రూపాయలకు మించి ఖర్చు కాదంటున్నారు. ఈటీవీలో నీటి సంరక్షణపై వచ్చే కార్యక్రమాల స్ఫూర్తితోనే తాను ఈ విధానాన్ని తయారు చేసుకున్నానని ఆయన తెలిపారు.

అదేవిధంగా కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్టు వద్ద ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్​లోనూ నీటి వృథాను అరికడుతున్నారు రఘనాథ్ రెడ్డి. వాటర్ ప్లాంట్ కోసం 3 బోర్లు త్రవ్వగా అందులో రెండు బోర్లలో నీరు పడలేదు. మూడో బోరు నుంచి నీరు సంవృద్ధిగా వస్తుంది. ప్లాంట్​లో ప్యూరిఫై కాగా వృథాగా వెళ్లే నీటిని బోర్ గుంతలకు పంపుతున్నాడు. దీనివల్ల నీరు పడని బోర్లు కూడా ఉపయోగంలోకి వచ్చాయి. కొంత నీటిని వాటర్ ప్లాంట్​లో ఉన్న మొక్కలకు, చెట్లకు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు.

వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటున్న రఘును ఆదర్శంగా తీసుకున్న కొందరు ఈ విధానాన్ని తమ గృహాల్లోనూ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details