''సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగడం ప్రత్యేక అర్హత ఏమీ కాదు. 40 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే మీరు ప్రజల కోసం చేసిందేమీ లేదు'' అంటూ తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ఉద్దేశించి వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్లలో కుటుంబ ఆస్తులను లక్ష రెట్లు పెంచుకున్నారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. గ్రామ వలంటీర్ల ఇంటర్వ్యూలపై అభాండాలు వేస్తున్నారని.. కావాలంటే దరఖాస్తు పెట్టుకుని ఇంటర్వ్యూకు వెళ్లిరావాలని లోకేశ్ కు విజయసాయి సూచించారు. బడ్జెట్ లో రాజధాని అమరావతి అభివృద్ధికి 500 కోట్లు కేటాయింపు చేయడంపై చంద్రబాబు చేసిన విమర్శలను విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. అమరావతి శంకుస్థాపనకే 300 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబుకు బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించడం చాలా చిన్నదిగా అనిపించడం సహజమేనని తెలిపారు.
విజయసాయి.. ట్విటర్లో అస్సలు ఆగడం లేదుగా! - chandrababu
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధానకార్యదర్శి లోకేశ్‌పై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
విజయ్ సాయిరెడ్డి