ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 18, 2021, 8:37 PM IST

Updated : Feb 19, 2021, 6:53 AM IST

ETV Bharat / state

ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేకే వైకాపా దాడులు: తెదేపా

కృష్ణా జిల్లా నందిగామలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులకు దిగాయి. తీవ్రంగా గాయపడిన ముగ్గురు మచిలీపట్నంలో చికిత్స పొందుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ysrcp cadder attack on tdp people in krishna district
ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేకే వైకాపా దాడులు: తెదేపా

కృష్ణాజిల్లా పెడన మండలం నందిగామలో వైకాపా వర్గం.. తెదేపా కార్యకర్తలపై కర్రలతో దాడి చేయడం.. ఉద్రిక్తతకు దారి తీసింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకే తమపై దాడులకు పాల్పడ్డారని తెదేపా ఆరోపిస్తున్నారు.

'వైకాపా బెదిరింపులు'

దాడిలో తీవ్రంగా గాయపడ్డ బొడ్డు చిన్న అమలేశ్వర రావు, బొడ్డు పెద్ద అమలేశ్వర రావు, బొడ్డు విక్కీలను చికిత్స కోసం మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. నందిగామలో తెదేపా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొడ్డు చిన్న బాబు 15 ఓట్లు మెజార్టీతో గెలిచిన కారణంగా.. వైకాపా వర్గం బెదిరింపులకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. తెదేపా బలపరిచిన అభ్యర్ధులు ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ బొడ్డు చిన్నబాబు పెడన ఎస్సై, జిల్లా ఎస్పీలకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.

వైకాపా దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులు..

ఇదీ చదవండి:రైలురోకోలో భాగంగా.. విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద రైతుల నిరసన

Last Updated : Feb 19, 2021, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details