ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్రకు రెండేళ్లు పూర్తి.. నేతల సంబరాలు - సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర

ప్రజా సమస్యల్ని తెలుసుకునేందుకు.. సీఎం జగన్ ప్రజా సంకల్పయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నేటికి రెండేళ్లు పూర్తైన సందర్బంగా.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేతలు సంబరాలు జరుపుకున్నారు.

CM Jagan completes two years for prajayatra
సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్రకు రేండేళ్లు పూర్తి.. నేతల సంబరాలు

By

Published : Jan 9, 2021, 3:05 PM IST

సీఎం జగన్ ప్రజా సంకల్పయాత్ర చేపట్టి నేటికి రెండేళ్లు పూర్తైన సందర్బంగా.. వైకాపా కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో.. నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు.

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు.. సీఎం జగన్ ప్రజా సంకల్పయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం 90 శాతం మేర పూర్తి చేశారని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details